10 April, 2026 | 12:40 PM

Breaking News

రేపటి నుండి టీపీఎల్ క్రికెట్ పోటీలు

10-04-2026 10:25 AM

ఫస్ట్ ప్రైజ్ రూ 60 వేలు, సెకండ్ ప్రైజ్ రూ 30 వేలు. 

మొగుల్ చంద్ర ఫౌండర్ ట్రస్ట్ ప్రభు కుమార్. 

తాండూరు, ఏప్రిల్ 10,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో ఈనెల 11వ తేదీ నుండి టి పి ఎల్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు మొగుల్ చంద్ర ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ ప్రభు కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రికెట్ పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చు అని ప్రవేశ  రుసుము 1500 రూపాయలు చెల్లించి తమ జట్టు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మొదటి స్థానంలో గెలిచిన జట్టుకు 60 వేల రూపాయలు రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 30 వేల రూపాయల తో పాటు ట్రోఫీ లను  అందిస్తామని ... పూర్తి వివరాలకు 88868 46607, 9010 454 807 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.