1 May, 2026 | 11:50 AM

బీఆర్ఎస్ లో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు

01-05-2026 10:23 AM

బోథ్,(విజయక్రాంతి): బోత్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రంగు రాజు శుక్రవారం స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసిందని అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను పట్టించుకోవడంలేదని వాపోయారు. కార్యక్రమంలో బోత్ పట్టణ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ ,విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు మేడి చల్మా ప్రవీణ్. బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎల్క రాజు లు ఉన్నారు