6 July, 2026 | 11:50 AM

మంత్రి ఉత్తమ్‌కు మాజీ మంత్రి గంగుల కౌంటర్

06-07-2026 10:59 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్(Former Minister Gangula Kamalakar) కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ కు కాళేశ్వరంపై అవగాహన లేదని గంగుల కమలాకర్ విమర్శించారు. కన్నెపల్లికి మేడిగడ్డకు సంబంధం లేదని గంగుల తెలిపారు.

కన్నెపల్లి ద్వారా పంపింగ్ చేయొచ్చని సూచించారు. మంత్రి ఉత్తమ్(Minister Uttam) అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని గంగుల(Gangula) ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 నెలల్లో తుమ్మిడిహెట్టి(Tummidihetti Barrage)పనులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతూందని వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన ప్రాజెక్టులపై కీలక ఆరోపణలు చేశారు.