మోహన్‌లాల్ వద్ద 10 ఏనుగు దంతాలు
మోహన్ లాల్ కీలక ప్రకటన..
వన్యప్రాణుల కేసు విచారణ
10 ఏనుగు దంతాలు, 13 విగ్రహాలున్నాయన్న ప్రముఖ నటుడు
వన్యప్రాణి సంబంధిత వస్తువుల కేసు విషయంలో ప్రముఖ సినీనటుడు మోహన్ లాల్(Film actor Mohanlal) కీలక ప్రకటన చేశారు. తన వద్ద 10 ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు ఉన్నట్లు మోహన్ లాల్ ప్రకటించారు. వన్యప్రాణి సంబంధిత వస్తువులు అక్రమంగా కలిగి ఉన్నారని మోహన్ లాల్ పై ఆరోపణలున్నాయి. వన్యప్రాణుల సంబంధిత వస్తువుల విషయంలో మోహన్ లాల్ విచారణ ఎదుర్కొంటున్నారు. కేరళ అటవీశాఖ(Kerala Forest Department) ఇచ్చిన క్షమాభిక్ష పథకంలో భాగంగా మోహన్ లాల్ ఈ ప్రకటన చేశారు. తమవద్ద ఉన్న వన్యప్రాణి వస్తువులను ప్రకటించు కోవడానికి అటవీశాఖ అవకాశమిచ్చింది. తన వద్ద ఉన్నవి వారసత్వం, బహుమతులుగా వచ్చినవేనని మోహన్ లాల్(Mohanlal ) వెల్లడించారు. మోహన్ లాల్ వద్ద ఉన్న వస్తువులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.






