1 May, 2026 | 11:22 AM

కేతిరెడ్డివాగు పైబ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

01-05-2026 10:21 AM

మాజీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పై పోరాటానికి పిలుపు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ ఆదేశం ప్రకారం గొట్టిపర్తి.. పోచారం గ్రామాల మధ్య ప్రజల రాక పోక లకు ఇబ్బంది పడుతున్నందున వానాకాలం రాకముందే బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని మాజీ బీ ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేస్తూ గొట్టిపర్తి గ్రామ శాఖ అధ్యక్షులు బర్ల సోమన్న ఆధ్వర్యంలో నిరసన తెలియ చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  సీతయ్య మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు  తుంగతుర్తి అప్పటి ఎమ్మెల్యే కిశోరన్న లు సంయుక్తంగా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం చేస్తే తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఎండ్లైన పూర్తి చేయక పోవడం వలన గొట్టిపర్తి పోచారం కర్ణాలకుంట తండా. సంధ్యాతండ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే. తుంగతుర్తి ఎమ్మెల్యే లు ప్రభుత్వం తొ మాట్లాడి మిగిలిఉన్న పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు తునికి సాయిలు. గొట్టిపర్తి నాయకులు హరిబాబు. యాకన్న. సురేష్. సమ్మద్. నాగేష్. ప్రవీణ్. భాస్కర్. రాజు. చిట్టి. బాబూ రావు. కూకట్ల యాకన్న. మద్దెల నరేష్. ఓడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు