6 July, 2026 | 12:38 PM

బంజారులంతా జులై 7న శీతల పండుగ చేద్దాం

06-07-2026 11:31 AM

లంబాడి ఐక్యవేదిక పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు

వడిత్యా శోభన్ నాయక్

ఖమ్మం, జూలై 6(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉన్న బంజారా సోదర సోదరీమణులందరూ జూలై 7న మంగళవారం శీతల పండుగను ఒకే రోజు ఐక్యమత్యంతో, సంప్రదాయబద్ధంగా, ఘనంగా జరుపుకోవాలని లంబాడి ఐక్యవేదిక పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు వడిత్యా శోభన్ నాయక్ పిలుపునిచ్చారు. శీతల పండుగ బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఈ పండుగను అందరూ కలిసికట్టుగా నిర్వహించడం ద్వారా బంజారా సమాజ ఐక్యత, సంస్కృతి మరియు వారసత్వం మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.గ్రామాలు, తండాలు, పట్టణాల్లో నివసిస్తున్న బంజారా ప్రజలందరూ కుటుంబ సభ్యులు, యువత, మహిళలు కలిసి సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ శీతల మాత ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరారు. బంజారా సమాజ అభివృద్ధికి ఐక్యతే బలమని, అందరూ భేదాభిప్రాయాలకు తావులేకుండా ఒకే వేదికపై కలిసి శీతల పండుగను విజయవంతం చేయాలని వడిత్యా శోభన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు