19 May, 2026 | 10:17 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

గ్రామీణ విద్యార్థులకు సువర్ణావకాశం

17-01-2026 06:45 PM

విజయక్రాంతి,పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీఎం కప్ క్రీడలు గ్రామీణ విద్యార్థులకు సువర్ణావకాశమని పాపన్నపేట ఎంపీడీఓ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రం పాపన్నపేటలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఈ పోటీల ద్వారా విద్యార్థులలోని క్రీడా ప్రతిభను గుర్తించే అవకాశముందని, గ్రామాలలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ప్రభాకర్, రాజేందర్, నాగరాజు, రమేష్, రేణుక, కృష్ణకాంత్, మంగ నర్సింలు, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.