19 May, 2026 | 9:14 PM

Breaking News

డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •  

ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

17-01-2026 06:41 PM

ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు జిల్లాల స్థాయిలో సింగరేణి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్–జాకస్–మండె డాగ్యురె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఖమ్మం–మణుగూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు టాస్ వేసి పోటీలకు శ్రీకారం చుట్టారు. టోర్నమెంట్‌కు హాజరైన ఎమ్మెల్యేను ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, సింగరేణి జీఎం వీసం కృష్ణయ్య, ఇల్లందు సీఐ తాటిపాముల సురేష్, మాజీ వైస్ ఎంపీపీ మండల రామ మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్లు దమ్మాలపాటి వెంకటేశ్వరావు, యదలపల్లి అనసూయ, సర్పంచులు బానోత్ శారద, అరెం ప్రియాంక, నాయకులు కాకటి భార్గవ్, ఈసం లక్ష్మణ్, దండుగుల శివ, టౌన్ మహిళా అధ్యక్షురాలు గాలపల్లి స్వరూప, ఫోటోగ్రాఫర్స్ టౌన్ ప్రెసిడెంట్ మారుతి ప్రకాష్, ఆర్గనైజర్స్ సుమిత్ర, బియన్ని సుదర్శన్, పప్పు, జగదీష్, సెక్రటరీ ఆకుల రమణ, యునస్, మదన్, నవిన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.