12 May, 2026 | 2:25 AM

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట..!

12-05-2026 01:19 AM

మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి..

ధర్మపురి,మే11(విజయక్రాంతి ): ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని, విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో సోమవారం సమ్మర్ క్యాంప్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులకు గొప్ప స్థాయిలో విద్యను అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. కుమ్మర్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు జగిత్యాల జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచినందుకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

వెల్గటూరు మండలం కిషన్ రావు పేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు పూర్తి అయ్యేవిధంగా అధికారులు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమలో జిల్లా గ్రంధాలయ చైర్మెన్ సంగనబట్ల దినేష్, పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి,మండల విద్యాధికారి బోనగిరి ప్రభాకర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్, కోటిలింగాల ఆలయకమిటీ చైర్మెన్ పూదరి రమేష్, వెల్గటూర్ మాజీ సర్పంచ్ మేరుగు మురళిగౌడ్ , ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, సీనియర్ నాయకులు గండ్ర శ్రీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.