12 May, 2026 | 1:58 AM

రేపటి నుంచి కాకతీయ కళల జాతర

12-05-2026 01:20 AM

హనుమకొండ, మే 11 (విజయక్రాంతి): చేతన కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 13, 15, 17 తేదీలలో కాకతీయ కళల జాతర (ఓరుగల్లు మహా సాంస్కృతిక సమ్మేళనం) కార్యక్రమము నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక సభ్యులు ఆకుల నాగేశ్వర్ తెలిపారు.

సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వర్ మాట్లాడుతూ వెయ్యి ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, కళావైభవం, ధీరత్వం దాతృత్వం, అలాగే గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, వంటి అంశాలు, భారతదేశంలోనే అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, పేరిణి, జానపదాలకు నిలయమైన, ఈ గడ్డమీద కాకతీయ కళల జాతర  నిర్వహించడం, నేటి తరానికి ఈ కార్యక్రమం పరిచయం చేయడం కోసం చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజలంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమానికి మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి, కూడ చైర్మన్ వెంకటరామిరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్, రెండవ రోజు కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, మాజీ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్, జనగామ శాసనసభ్యుడు పల్ల రాజేశ్వర్ రెడ్డి, మూడోరోజు వరంగల్ కోటలో కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తూర్పు మాజీ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. 

సహా కార్యనిర్వాహకుడు గోకారపు శ్యాం కుమార్, బూరం ప్రశాంత్, నిర్వాహకులు మచ్చ రాజు, గాయకులు జూపాక శివ, శ్రీనివాసరెడ్డి, రాజేష్, సునీల్ రావు,దేవేందర్,రాజి రెడ్డి, అమర్, సాగర్,రంజిత్, నవీన్,రాజేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.