ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
తుంగతుర్తి (విజయ క్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తల మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని వెంపటిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లింగమూర్తికి వినతిపత్రం అందించి మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు రూ.18వేల వేతనంతో పాటు ,ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల అవుతున్న ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఆశ కార్యకర్త మరణిస్తే రూ.50 వేల రూపాయలు ఎక్స్ రేషియో ఇస్తామని, నేటి వరకు కూడా అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే ఆశా కార్యకర్తల డిమాండ్ ను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు రాజేశ్వరి, చిత్తలూరి రామ, యాకలక్ష్మి, లీలారాణి, షమీనా, ఎనగందుల. రామ, సుజాత, రేణుక, సుజాత, తదితరులు పాల్గొన్నారు.






