హౌస్ కీపర్లు,ఆఫీస్ సబార్డినేట్లను జేపీఏలుగా కన్వర్షన్ చేయండి
బీటీపీయస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న కు వినతిపత్రం ఇచ్చిన TSPEU -1535 నాయకులు
మణుగూరు,(విజయక్రాంతి): బిటిపిఎస్ లో పనిచేస్తున్న హౌస్ కీపర్లు,ఆఫీస్ సబార్డినేట్లను జేపీఎ (Junior Plant Attendant)లుగా కన్వర్షన్ చేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్-1535 నాయకులు చీఫ్ ఇంజనీర్ బి.బిచ్చన్న ను కోరారు. ఈ మేరకు శనివారం ఆ సంఘం రీజినల్ అధ్యక్షులు వి. ప్రసాద్, స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏ. వెంకటేశ్వర్లు, కోశాధికారి పి. శ్రీనివాస్ తదితరులు బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆయన కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు.31,ఆగస్టు2026 తేది వరకు ఐదు ఇంక్రిమెంట్లు తీసుకున్న హౌస్ కీపర్ లను జేపీలుగా కన్వెన్షన్ చేసేందుకు జెన్కో ఇటీవల సర్కులర్ విడుదల చేసిందని చెప్పారు. అయితే ఈ గడువుని 30,నవంబర్2026 వరకు పొడగించాలని కోరారు.
ఈ మూడు నెలలు పొడిగిస్తే హౌస్ కీపర్ లందరూ జెపిఏ లుగా కన్వర్షన్ అవుతారని గుర్తు చేశారు. కర్మాగారం లో ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసీ...పదో తరగతి పాసైన ఆఫీస్ సబర్డేనేట్ల అందరిని జెపిఎ లుగా కన్వర్షన్ చేసే జీవో ఉందని చెప్పారు. ఈ జీవో ను అనుసరించి ఆఫీస్ సబార్డినేట్లను జెపిఎ గా కన్వర్షన్ చేయాలని కోరారు. భూ నిర్వాసిత కోటాలో నియమితులైన జూనియర్ అసిస్టెంట్ల సర్వీసును డేటాఫ్ జాయినింగ్, డేట్ అఫ్ బర్త్ ను పరిగణలోకి తీసుకొని నిర్ణయించాలని పేర్కొన్నారు. హౌస్ కీపర్ లకు గడువు పెంచేందుకు,ఆఫీస్ సబార్డినేట్లను జెపిఎలు గా కన్వర్షన్ చేసేందుకు చీఫ్ ఇంజనీర్ సానుకూలంగా స్పందించారు. జూనియర్ అసిస్టెంట్ల సీనియారిటీని నిబంధనలను అనుసరించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ సబార్డినేట్లు గౌస్ పాషా,కళ్యాణ్, రాము, నరసింహారావు, అప్సియ,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.






