24 June, 2026 | 6:11 PM

నీటి సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మకు గుండె పోటు

24-06-2026 05:06 PM

జనగామ, జూన్ 24 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నగర్ లో  బుధవారం ఉదయం 10:00 గంటల సమయంలో, ప్రమాదవశాత్తు ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందింది. చిన్నారి మరణం తట్టుకోలేక నాయనమ్మ మారబోయిన నాగమ్మ ఏడుస్తూ,  గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందడం జరిగింది. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.