11-02-2026 01:13:31 AM
ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు
403 వార్డులకు 865 పోలింగ్ కేంద్రాలు
ఓటరన్న తీర్పు ఎవరివైపో ?
టెన్షన్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఈనెల 13న ఎన్నికల ఫలితాలు
సంగారెడ్డి, ఫిబ్రవరి 10(విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఈ మేరకు అధికా రులు పోలింగ్ కేంద్రాలతో పాటు ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా బుధవారం నాడు 19 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నా యి. గత వారం రోజులకు పైగా నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలతో పాటు స్వం త్రులు, రెబల్ అభ్యర్థులు విస్తృతంగా ప్రచా రం సాగించారు.
అందరి విన్నపాలు, హామీ లు విన్న ఓటరన్న తీర్పు ఇచ్చే సమయం ఆ సన్నమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలకు, మెదక్ జిల్లాలో నాలుగు, సిద్దిపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నా యి. మంగళవారం నాడు అధికారులు ఆ యా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సి బ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశా రు.
బుధవారం ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 403 వార్డులకు గాను 865 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో ఇలా...
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల పరిధిలో 541 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3,41,808 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,71,151 మంది పు రుషులు, 1,70,638 మంది మహిళలు, ఇతరులు 19 మంది ఉన్నారు. మొత్తం జిల్లాలో 256 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్ నిర్వహణ కోసం జిల్లాలో 103 మంది రిటర్నింగ్ అధికారులు, 103 అసిస్టెం ట్ రిటర్నింగ్ అధికారులు, 649 మంది ప్రి సైడింగ్ అధికారులు, 649 అసిస్టెంట్ ప్రిసైడింగ్, 1,948 మంది ఇతర పోలింగ్ అధికా రులు, 73 మంది మైక్రో అబ్జర్వర్లు, 49 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలో...
మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 75 వా ర్డులకు గాను మెదక్ పట్టణంలోని ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 74 వార్డులకు ఎన్నిక లు జరుగుతున్నాయి. ఇందుకు గాను 148 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ యా మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారులుగా 180 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అ ధికారులుగా 180, ఓపీఓఎస్ అధికారులుగా 482, జోనల్ అధికారులుగా 23 మంది నియమించారు.
సిద్దిపేట జిల్లాలో...
సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గాను సిద్దిపేట మినహా నాలుగు ము న్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 72 వార్డులకు గాను 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించా రు. ఇందుకు గాను 31 మందిని అబ్జర్వర్లుగా ఏర్పాటు చేశారు. 1,069 మంది పోలింగ్ సిబ్బందిని నియమించగా 22 మందిని జో నల్ అధికారులుగా నియమించారు. నాలు గు మున్సిపాలిటీల పరిధిలో 1,01,085 మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు.