calender_icon.png 11 February, 2026 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకే తొలి ప్రాధాన్యం

11-02-2026 01:14:50 AM

  1. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

రూ.కోటి 65 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభం

పటాన్చెరు, ఫిబ్రవరి 10 :ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్లను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజి, మ్యాక్ సొసైటీ కాలనీలలో ఒక కోటి 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, కాంపౌండ్ వాల్, కమ్యూనిటీ హాళ్లను ఆయన ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇందుకు అనుగుణంగా ప్రణాళికల రూపొందిస్తూ నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సొంత నిధులతో వివిధ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మ్యాక్ సొసైటీ కాలనీలో బీటీ రోడ్డు రెన్యూవల్ కు సంబంధించి నిధులు మంజూరయ్యాయని.. డబుల్ రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.

మ్యాక్ సొసైటీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో సొంత నిధులతో బోరుతో పాటు బోరు వేయించడం జరిగిందని.. త్వరలోనే మోటారు బిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, డి ఈ వెంకటరమణ. సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, కుమార్ గౌడ్, పెద్ద రాజు పాల్గొన్నారు.