27 February, 2026 | 11:57 PM

Breaking News

నేడు శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతి

27-02-2026 12:00 AM

బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్

బాన్సువాడ,ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ తెలిపారు.

గురువారం బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మోహన్ నాయక్ మాట్లాడుతూ శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బంజర సోదరులు ప్రతి ఒక్కరు బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో నిర్వహిస్తున్న శ్రీ సంతు సేవలల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటల కు బోగు బండారు కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆయన  తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డిలు హాజరై కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని తాండాలు గ్రామాల నుండి  సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బంజారా సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై బోగు బండారు కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన తెలిపారు.

ఆల్ ఇండియా జాతీయ శక్తిపీట్ ప్రధాన కార్యదర్శి బద్యా నాయక్, బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్ సింగ్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నరేష్ రాథోడ్,భాస్కర్, ప్రేమ్ సింగ్, మాజీ ఎంపీపీ పాలితే విటల్, సక్రునాయక్,  ఏ ఐ బి ఎస్ ఎస్ కామారెడ్డి జిల్లా ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి  సాంభ్య, నరేష్ రాథోడ్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.