మార్పులు రావాలంటే రాజకీయంగా రాణించాలి
రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర పిలుపు
ముషీరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సగరులు రాజకీయంగా ఎదిగినప్పుడే జీవన స్థితిగతులలో మార్పు రాగలదని, దీని కోసం ప్రతి ఎన్నికల్లో సగరులు పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సగర సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శేఖర్ సగర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 39 మంది సగరులు సర్పంచులుగా గెలుపొందారని, 9 మంది కౌన్సిలర్‌లుగా, కార్పొరేట ర్‌లుగా విజయం సాధించారని, భవిష్యత్తు లో హైదరాబాద్ నగర పాలక సంస్థకుకు జరిగే ఎన్నికల్లో సగరులు అనేక డివిజన్లలో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా సగరులకు ఫెడరేషన్ కాకుండా సగర కార్పొరేషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికృష్ణ సగర, సగర భగీరథ ఆత్మగౌరవ భవన వెల్ఫేర్ చైర్మన్ ఆస్కాని మారుతి సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర, రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆర్‌బి. ఆంజనేయు లు సగర, రాష్ట్ర మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లవి సగర, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి సగర, కోశాధికారి జయమ్మ సగర, సలహాదారులు మనీ మంజరి సగర, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సురేష్ సగర, ప్రధాన కార్యదర్శి మహేందర్ సాగర్, కోశాధికారి సాయి గణేష్ సగర, రాష్ట్ర సంఘం నాయకులు, జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు హాజరయ్యారు.




