14 July, 2026 | 3:57 PM

Breaking News

తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •  

ఘనంగా చింతలగట్టు జాతరలో తిరుగువారం పండుగ

05-02-2026 12:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతల గట్టు వట్టి వాగు గబ్బిలాల మడు గు,  సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు సందర్భంగా బుధవారం తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు. ఆదివాసి పూజారులు గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. తెలుగు వారం పండగ వేడుకలో ఆదివాసి పూజారులు దారం సిద్దు, జాతర కమిటీ అధ్యక్షుడు కారం లక్ష్మయ్య ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు వన దేవతలకు బోనాలతో తరలివచ్చి నైవేద్యం సమర్పించారు. పెద్ద ఎత్తున తిరుగు వారం వేడుకకు భక్తులు హాజరయ్యారు.