14 July, 2026 | 4:03 PM

Breaking News

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •  

సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన

14-07-2026 03:19 PM

పెద్దపెల్లి జిల్లా బియ్యం మాత్రమే దించుకోవాలి

వేరే జిల్లాల బియ్యం ఇక్కడ దించవద్దు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పక్కన గల పెగ్గు గోదాంల వద్ద మంగళవారం రైస్ మిల్లర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భం గా  గోదాం అధికరికి వినతి పత్రం అందజేశారు. ఇక్కడి గోదాంలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బియ్యం మాత్రమే దించుకోవాలని, వేరే జిల్లాల కు సంబంధించి ఇక్కడ బియ్యం దించడం వలన తాము తీవ్ర ఇబ్బందిగా గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా వ్యాప్తంగా 140 రైస్ మిల్లులు ఉన్నాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కామన్ గా చేయటంతో , తాము మూడోవంతు కూడా బియ్యం దించలేకపోతున్నామని అన్నారు. ఈ విషయమై ఎఫ్సీఐ అధికారులతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని వెంటనే అధికారులు స్పందించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మాత్రమే బియ్యం దించుకోవాలని, ఇతర జిల్లాల బియ్యం ఇక్కడ దిస్తే ఆందోళన చేపట్టడం జరుగుతుందని రైస్ మిల్ వ్యాపారులు అన్నారు. ఇందులో పెద్ద ఎత్తున రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.