కార్మికులకు ఆరోగ్య భరోసా
14-07-2026 03:38 PM
హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీలోని వ్యర్థాల సేకరణ కార్మికులకు నమస్తే పథకం కింద ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, వ్యక్తిగత రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కార్మికులకు కార్డులు, రక్షణ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, వారి ఆరోగ్యం, భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






