10 March, 2026 | 4:21 AM

త్రిషకు సారి..

10-03-2026 12:00 AM

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ త్రిషపై నటుడు, దర్శకుడు ఆర్ పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై త్రిష పరోక్షంగా స్పందించడంతో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది. తాజాగా దీనిపై పార్తిబన్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో నేను పశ్చాత్తాపం పడటం తప్ప మరో మార్గం లేదు’ అని పేర్కొన్నారు.

కొంతకాలంగా త్రిషపై కొన్ని రూమర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో పార్థిబన్.. “కొన్ని రోజులు ఈ కుందవై (పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో త్రిష పాత్ర పేరు) ఇంట్లో ఉంటేనే మంచిది. బయటకు రావడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. దీనికి త్రిష స్పందిస్తూ ‘చేతిలో మైక్ ఉందని మాట్లాడే ప్రతి మాట తెలివైనదిగా ఉండదు. దాని వల్ల హాస్యం పండదు. అది కేవలం మూర్ఖత్వం అవుతుంది’ అని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో పార్థిబన్ స్పందించారు.