25 February, 2026 | 4:34 AM

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

25-02-2026 01:39 AM

పటాన్ చెరు, పిబ్రవరి 24: పటాన్ చెరు పరిధిలోని ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్థానిక సి ఐ వినాయక్ రెడ్డి తెలిపారు. ఈనెల 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో, పరీక్ష కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచకూడదని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటున్నదన్నారు. సెంటర్ల వద్ద గుంపులుగా తిరగడం నిషేధమన్నారు. ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఇతర ఎవరూ కూడా పరీక్ష కేంద్రంలో సెల్ఫోన్ వినియోగించరాదన్నారు.