23 April, 2026 | 1:07 AM

పెట్టుబడి ఒప్పందాలు అమల్లోకి రావాలి

23-04-2026 12:00 AM
  1. ఆటంకాలను తక్షణమే తొలగించాలి
  2. రియల్ టైం డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించాలి
  3. పెట్టుబడులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే భూముల కేటాయింపుతో పాటు ఇతర అనుమతులు ఇచ్చిన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తో పాటు ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బుధవారం రాత్రి సమీక్ష నిర్వ హించారు.

ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి పనులు ప్రా రంభమైన కంపెనీ లు.. అనుమతుల దశలో ఉన్న కంపెనీలు.. సాంకేతిక, ఇత ర సమస్యలతో పనులు పెండింగ్‌లో ఉన్న సంస్థల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఫ్యూచ ర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థకు కేటాయించిన భూము లు, అక్కడి మార్కెట్ ధరలు.. ఆయా కంపెనీలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న మొత్తాన్ని వివరించారు.

క్యూర్, ఫ్యూర్, రేర్ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు భూములు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇందు కు అనుమతులు వేగంగా ఇవ్వాలని.. ఆయా కంపెనీలు పనులు త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ విషయంలో పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు ఉండాలన్నారు.

డాటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగినవిధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులుగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని, మల్టీనేషనల్, మార్కెట్లో పేరు ప్రతిష్టలున్న కంపెనీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలలన్నారు. పెట్టుబడుల సాధనకు రాష్ట్రాల మధ్య ఉన్న పోటీతత్వాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.

ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలన్నారు. ఫ్యూచర్ సిటీలో కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంవోయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని  సీఎం రేవంత్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. పను లు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభో త్సవానికి ఏర్పాట్లు చేయాలని, డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి..

పెట్టుబడులకు సంబంధించి ఒక పూర్తి స్థాయి మానిటరింగ్ వ్య వస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అది పని చేసేలా చూడాల న్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆయా టవర్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి జైకా నిధులతో చేపట్టనున్న పనులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు.

పరిశ్రమల శాఖపై సమీక్షకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు పనులపై సీఎం సమీక్షించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో మెట్రో పనులకు సంబంధించి మిగిలిన కొంత భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రెండేళ్లలోనే చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు పనులు పూర్తి కావాల న్నారు.

రెండో దశ మెట్రో అనుమతులు, బహదూర్‌గూడ వద్ద హైస్పీడ్ కారిడార్ వద్దకు మెట్రో విస్తరణ అంశాలపైనా చర్చించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్ర మల శాఖ ప్రత్యేకకార్యదర్శి భవేష్ మిశ్రా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ప్రత్యేక ప్రధా నకార్యదర్శి జయేష్‌రంజన్, మెట్రో సలహాదారు ఎన్‌వీఎస్.రెడ్డి పాల్గొన్నారు.

నేడు క్యాబినెట్ సమావేశం

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన ప్రధానంగా చర్చించి.. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి అడ్వకేట్ జనరల్ కూడా హాజరుకానున్నారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని లీగల్ టీమ్ చెబుతోంది. మొదటిది సుప్రీంకోర్టుకు వెల్లడం లేదా రెండోది కొత్త కమిషన్ నియమించడం వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.