22 April, 2026 | 10:41 PM

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు

22-04-2026 09:21 PM

- జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా జిల్లాలో చేపడుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా చట్టపరంగా చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు అనుమతి తీసుకున్న ప్రదేశంలో మాత్రమే సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని అది కాకుండా ఆర్టీసీ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.