25 February, 2026 | 3:21 AM

రొమ్ము క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన

25-02-2026 01:41 AM

మునిపల్లి, ఫిబ్రవరి 24: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కృషితో హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రి సౌజన్యంతో మంగళవారం మండల కేంద్రమైన మునిపల్లి గ్రామ సర్పంచ్ రాజగోని సౌంధర్య నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం డాక్టర్ సంధ్యారాణి పాల్గొని మాట్లాడారు.మహిళలు రొమ్ము క్యాన్సర్(బ్రెస్ట్ క్యా న్సర్)పై అవగాహన కలిగి ఉండాలన్నారు. రొమ్ము క్యాన్సర్ కొందరికే వస్తుందనే అపో హ ఉందని, ఎవరికైనా ఆవ్యాధి వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఈ విషయాన్ని మహిళలందరు గుర్తించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేసే రొమ్ము క్యాన్సర్ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గ్రామ సర్పంచ్ సౌంధర్య నరేందర్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన గ్రామ ప్రజలందరికి ఎల్లప్పుడు అం దుబాటులో ఉండివారికి సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నర్సింలు, డాక్టర్ సంధ్యారాణి, గ్రామ ఉప సర్పంచ్ ఇందూరి పాండు, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి వీరు యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు పటేల్,  గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, వార్డు సభ్యులు మెంబర్ సలవంద్రి రాందాస్, రోడ్డే కుమార్, సీసీలు శివయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.