23 April, 2026 | 1:07 AM

ఆరంభ శూరత్వమేనా..?

23-04-2026 12:00 AM
  1. పడకేసిన అమృత్ పథకం
  2. పనులు చేపట్టి ఏడాదిన్నర 
  3. పట్టించుకోని అధికారులు
  4. గొంతు తడపని నీటి పథకం

బెల్లంపల్లి, ఏప్రిల్ 22: అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం వెరసి తాగునీటి పథకం నిర్మాణ పనులు ఆరంభశూరత్వాన్నీ తలపిస్తున్నాయి. నిర్మాణ పనులు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి... ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ 2.0 తాగునీటి పథకంపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేకుండాపోయింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లి పట్టణానికి ప్రత్యేకంగా ఉద్దేశించిన ఈ తాగునీటి పథకమే అమృత్ నీటి పథకం. రూ.60.50 కోట్ల నిధులతో 2024లో ఈ పథకాన్ని కన్నాల జాతీయ రహదారి పక్కన ఉన్న మిషన్‌భగీరథ పంపు హౌజ్ వద్ద చేపట్టారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు. ఈ పథకంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నెలకొల్పాలి. శంకుస్థాపన పిదప ఇప్పటి వరకూ ఈ పథకం నిర్మాణ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదు. పనుల్లో పూర్తి నిర్లిప్తత ఆవరించింది.

ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఉండి పోయాయి. పూనాదికే ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు పరిమితమయ్యా యి. నీటి పథకం పనులకు తీవ్ర జాప్యం తీరని ఆశనిపాతమయ్యాయి. ఫలితంగా నిర్దేశించిన కాలంలో ఈ పథకం పూర్తి కాలేకపోయింది. దీంతో అమృత్ తాగునీటి పథకం ప్రజల ఆశలను అడియాశలు చేసింది. పనులు చేపట్టి ఏడాదిన్నర దాటిపోయింది. ఇంకా పూర్తి కాలే దు. పనులు పూర్తయితే ఈ వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీరు అందేది.

బెల్లంపల్లి ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వితంగా తీరిపోయే దీ. మిషన్ భగీరథ పథకంతో అడ ప్రాజెక్టు నుంచి గత ప్రభుత్వం తాగు నీటి సరఫరా చేపట్టింది. అడ ప్రాజెక్టు నుంచి సరఫరా అవుతు న్న తాగునీరు పూర్తి కలుషితమన్నా అభిప్రాయాలు ఉన్నాయి. రెండున్నర ఏళ్ల నుంచి బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఈ కలుషిత నీటినే తాగుతున్నారు. బెల్లంపల్లి పట్టణానికి సురక్షతమైనా మంచినీటి పథకం ఇప్పటికీ లేదు. సింగరేణి కాలనీలకు కంపెని తాగునీటిని అందిస్తున్నది. గోదావరి తాగునీరు వారానికోసారి మాత్రమే సరఫరా అవుతున్నది.

అవికూడా సరిపడా అందడం లేదన్న అసంతృప్తులు కార్మికుల్లో వ్యక్తం అవుతున్నది. మునిసిపల్ వార్డు ప్రజలకు మిషన్ భగీరథ పథకం నీటిని అందిస్తున్నారు. అవికూడా అరకొరగా  అందుతున్నది. నీటి కొరతను తీర్చడం కోసం చేప ట్టిన అమృత్ 2.0 పథకంపైనే  ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.

పనులేమో ఇప్పట్లో పూర్తయ్యేటట్టు లేవు. ఎల్లంపల్లి ప్రాజెక్టు తాగునీటి కోసం ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్నారు. పైపు లైన్ పనులు పట్టణంలో కొంతమేరకు అయ్యాయి. ఇంకాపూర్తి కాలేదు. అమృత్ నీటి పథకం పనులు మందమర్రిలోఆగిపోయాయి. పైపు లైన్ పనులు ముందుకు సాగడంలేదు. మొత్తంగా అమృత్ 2.0 నీటి పథకం పనులు పూర్తవ్వడానికీ సుదీర్ఘ కాలం పట్టే పరిస్థితే కనిపిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు తాగునీరుల్లంపల్లికి చేరడానికి ప్రజలు మరో వేసవికాలాన్ని చూడక తప్పేట్టు లేదు.