12-02-2026 04:32:05 PM
- జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం ఎన్నికల నిబంధనలకు లోబడి పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
నాగర్‌కర్నూల్‌లో 8 టేబుళ్లు 24 మంది అధికారులు, కల్వకుర్తిలో 8 టేబుళ్లు 24 మంది, కొల్లాపూర్‌లో 7 టేబుళ్లు 21 మంది అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో రౌండ్‌లో 8 వార్డుల చొప్పున మొత్తం 3 రౌండ్లలో ఫలితాలు ప్రకటించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమతి ఉన్న వారినే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.