12-02-2026 04:35:43 PM
సిద్దిపేట రూరల్: పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామంలో డీసీసీబీ రాఘవపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సుధారాణి మాట్లాడుతూ కేవైసీ, ఈ-కేవైసీ, రీ-కేవైసీ, సీ-కేవైసీ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. బ్యాంక్ ఖాతాల అవసరం, పొదుపు అలవాట్లు, సామాజిక భద్రత పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
సైబర్ నేరాల నుంచి జాగ్రత్తలు, బ్యాంకు సేవలు, బ్యాంకింగ్ ఉత్పత్తుల వినియోగంపై వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ భట్టు భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ అందె మాధవి రాజేశం, డీసీసీబీ ఫీల్డ్ ఆఫీసర్ అరవింద్, గ్రామపంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, సిద్దిపేట రూరల్ సిఎఫ్ఎల్ కౌన్సిలర్లు సాయి కృష్ణ, శ్రీనివాస్, వివోఏ శ్యామల, వార్డు సభ్యులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.