అమెరికాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థులు మృతి
26-08-2026 12:52 PM
హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు(Telangana students) ప్రాణాలు కోల్పోయారు. ఆ ముగ్గురు విద్యార్థులలో ఒకరు నిజామాబాద్ జిల్లాకు(Nizamabad District) చెందినవారు. ఉన్నత విద్య కోసం ఆ ముగ్గురు విద్యార్థులు మూడు నెలల క్రితం అమెరికా వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫ్లోరిడాలోని అధికారులు ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రస్తుతం మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మృతుల కుటుంబాలు వెల్లడించాయి.






