ఉట్నూర్ కు చెందిన ప్రొఫెసర్ జునుగురు శ్రీనివాస్ కు అరుదైన గౌరవం
ఉట్నూర్, ఆగస్టు 26( విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన జునుగురు శ్రీనివాస్ కు అరుదైన గౌరవం లభించింది.గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న వలస కార్మికుల సంక్షేమం కోసం పిలిప్పిన్ దేశంలో అమలు చేస్తున్న పాలసీని గూర్చి అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరి కమిటీలో సభ్యుడిగా ఉన్న ఉట్నూర్ కు చెందిన ప్రొఫెసర్ జునుగురు శ్రీనివాస్ మంగళవారం పిలిప్పిన్ వెళ్ళారు. కాగా త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గల్ఫ్ ఎన్నారై పాలసీ, రూపకల్పన గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న వలస కార్మికుల సంక్షేమం, కార్మికుల రక్షణ కోసం పిలిప్పిన్ దేశ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవస్థలు, ఉత్తమ పద్ధతులను ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అధ్యయనం చేయాడానికి ఈ బృందం పిలిప్పిన్ వెళ్ళారు.
కాగా ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన జునుగురు శ్రీనివాస్ హైదరాబాద్ లోని అసోసియెట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర అడ్వైజరీ కమిటి లో మెంబర్ గా కొనసాగుతున్నారు. జునుగురు శ్రీనివాస్ పిలిప్పిన్ వెళ్ళడం పట్ల స్థానిక ఉట్నూర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రీనివాస్ సైతం అరుదైన గౌరవంగా భావిస్తున్నాడు. వీరితో పాటు ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్,కమిటి ఛైర్మెన్ బి ఎం వినోద్ కుమార్, మంద భీం రెడ్డి, సభ్యులు నరేష్ రెడ్డి, దేవేందర్ తదితరులు ఉన్నారు






