26 August, 2026 | 2:03 PM

సరస్వతి నగర్‌లో డ్రైనేజీ పనుల పరిశీలన

26-08-2026 01:02 PM

బోధన్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని 35వ వార్డు సరస్వతి నగర్‌లో జ్ఞాన వాటిక స్కూల్ పక్కన, పోచమ్మ గుడి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్, 35వ వార్డు కౌన్సిలర్ తూము పద్మశరత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడితే వర్షాకాలంలో మురుగు నీరు నిలిచిపోకుండా ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తూము పద్మశరత్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.