26 August, 2026 | 2:05 PM

29న మారేళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభం

26-08-2026 01:06 PM

అశ్వాపురం, ఆగస్టు 26(విజయక్రాంతి): రైతుల సాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో చేపట్టిన మారేళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఈ నెల 29న ప్రారంభం కానుందని బుధవారం ఓ ప్రకటనలో మాజీ ఎంపీపీ ఊసా అనిల్‌కుమార్‌ తెలిపారు. ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు సాగునీరు అందుబాటులోకి రావడంతో పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడంతో పాటు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నీరు అందుబాటులోకి వస్తే పంటల సాగు మరింత విస్తరించి రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.