calender_icon.png 24 February, 2026 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబర్పేటలో విషాదం

24-02-2026 11:45:53 AM

హైదరాబాద్: నగరంలోని అంబర్ పేటలో(Amberpet) మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరి వేసుకుని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను రామరాజు(55), మాధవి(50), శశాంక్(24) గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.