24-02-2026 12:23:43 PM
హైదరాబాద్: జగిత్యాల(Jagtial) జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీలో(Nookapally Urban Colony) దారుణం చోటుచేసుకుంది. అప్పు విషయంలో మహిళతో రుణదాతలు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అప్పు చెల్లించాలని అనూష అనే మహిళతో నలుగురు గొడవ పడ్డారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అనూష ఇంటికి వెళ్లి దూషించారు. అవమానం భరించలేక అనూష ఆటోలో బయలుదేరింది. అనూష వెనకాలే మరో ఆటోలో ఇద్దరు మహిళలు వెంబడించారు.
రాజారం వద్ద రుణదాతల ముందే ఎస్ఆర్ఎస్పీ కాలువలో(SRSP Canal) దూకింది. అనూష దూకడాన్ని గమనించి కూడా ఇద్దరు మహిళలు అడ్డుకోలేదు, కాలువలో దూకుతున్న అనూషను కాపాడకుండా మహిళలు ఆటోలో పారిపోయారు. ఘటనను గమనించిన స్థానికులు కాపాడేలోపే అనూష మరణించింది. అనూషను ఇంటి వద్ద దూషించిన వారిని విజయవాడ వాసులుగా గుర్తించారు. అనూష ఆత్మహత్య తర్వాత ఓంకార్, సతీశ్, ఇద్దరు మహిలలు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.