24 February, 2026 | 12:49 PM

స్పైస్‌జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

24-02-2026 11:17 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం లేహ్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్(SpiceJet Emergency Landing) విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తింది. టేకాఫ్ అయిన కాసేపటికి మళ్లీ ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. స్పైస్‌జెట్ విమానం రెండో ఇంజిన్ ఫెయిల్ అయినట్లు పైలెట్ గుర్తించారు. సాంకేతిక సమస్య గుర్తించి మళ్లీ ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఢిల్లీ నుండి లేహ్(Delhi to Leh) వెళ్లాళ్సిన బోయింగ్ 737 విమానంలో దాదాపు 150 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

ఢిల్లీ-లేహ్ విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధి ధృవీకరించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చారు. విమాన ప్రయాణంలో కాక్‌పిట్ లోపల ఎటువంటి అగ్ని ప్రమాద హెచ్చరిక లేదని ఎయిర్‌లైన్స్(Airlines) తెలిపింది. జార్ఖండ్‌లోని చత్రలో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత, ఢిల్లీ నుండి లేహ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమానం మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. రాంచీ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఒక వైద్యుడు, రోగితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు సహా విమానంలో ఉన్న అందరూ మరణించారు.