2 May, 2026 | 1:08 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

౩ కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం

28-02-2026 12:36 AM
  1. జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) :  అవుటర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బన్) మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని సీఎం తెలిపారు.

ఎంఏయూడీపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించా లని తెలిపారు.  ఉపాధి హామీలో రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం వరకు మళ్లీ వేయడానికి అనుమతులు రావని.. అలాంటి సాం కేతికతను వినియోగించాలని సూచించారు.

రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవిత కాలం ఎంతనేది నిర్ణయించి.. ఆ లోపు దానిని తొలగించినా.. అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటిని ఎంఏయూడీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. పర్యాటక ప్రదేశాలుగా జల వనరులను మార్చాలన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.