25 February, 2026 | 5:19 AM

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

25-02-2026 12:32 AM

ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్న పోలీసులు 

ముషీరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): నగరంలోని అంబర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. రామ్ రాజ్ (55) అంబర్ పేటలోని బాపు నగర్ లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన ఇంటి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రామ్ రాజ్ (55) తో పాటు ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24) విగతజీవు లుగా పడి ఉన్నారు. మొదటగా భార్య సూసైడ్ చేసుకోగా తర్వాత భర్త రామరాజ్ ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడని, అనంతరం కొడుకు శశాంక్ తన చేతిమని కట్టును కత్తితో కోసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సికింద్రాబాద్ అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య తెలిపారు. క్లూస్ టీమ్స్ ద్వారా వివరాలు సేకరి స్తున్నట్లు ఆయన వెల్లడించారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవా ఖానకు తరలించారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.