పోలీసుల విధులకు ఆటంకం..ముగ్గురు అరెస్ట్
27-02-2026 12:30 AM
వేములవాడ, ఫిబ్రవరి 2౬,(విజయక్రాంతి)వేములవాడ: సోమవారం రాత్రి వేములవాడ టౌన్ పరిధిలో బ్లూ కోర్ట్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులతో దురుసుగా ప్రవర్తించి, వారి విధులను అడ్డుకున్న ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్, రాహుల్, సుమన్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేసి, వారిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై గుమిగూడడం, బైక్లపై తిరగడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ హెచ్చరించారు.చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




