20 May, 2026 | 3:22 AM

వరుసచోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్

20-05-2026 12:51 AM

సిద్దిపేట క్రైం, మే 19 : రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇళ్లు, ఆరుబయట నిద్రిస్తున్నమహిళలనులక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట్ మండలం పుల్లగిరిగ్రామపంచాయతీ పరిధిలోని గుంట తండాకు చెందిన ముడావత్ కాల్య, ముడావత్ చందు తుపుడ తండాకు చెందిన ముడావత్ పాండు అనే ముగ్గురు వ్యక్తులు కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు.

కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేట గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువా తాళం పగులగొట్టి చూడగా, విలువైన ఆభరణాలు, డబ్బుకనిపించకపోవడంతో అందులో ఉన్న వస్తువులను చిందర వందరగా విసిరేశారు. దేవుడి గదిలో ఒక బ్యాగు కనిపించగా, అందులో ఒక తులం బంగారు గొలుసు, రెండు చేతి గడియారాలనుదొంగిలించారు. ఈ విషయమై బాధితుడు కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను పట్టుకోవటానికిఅదనపు డీసీపీ(అడ్మిన్) కుశాల్కర్ పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్, ఇన్స్పెక్టర్ రవీందర్, సిద్దిపేట రూరల్, చేర్యాల సీఐలు విద్యాసాగర్, రమేష్, కొమురవెల్లి, బెజ్జంకి ఎస్‌ఐలు మహేష్ , తిరుపతి ఆధ్వర్యంలోప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారు సేకరించిన సమాచారము మేరకు వేచరేణి గ్రామ పరిధిలో గల గుర్జకుంట కమాన్ వద్దకొమురవెల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితులను పట్టుబడ్డారు.

వారిని విచారించగా, బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో శీలాపూర్, వెంకట్రావుపల్లి, రేగులపల్లి గ్రామాలలో, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేట గ్రామంలో నిద్రిస్తున్న మహిళల మెడల నుంచి బంగారు ఆభరణాలు, తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చొరబడి దొంగతనం చేసినట్టు అంగీకరించారు వారి వద్ద నుంచి 9 తులాల బంగారు, 12 తులాల వెండిఆభరణాలు, మారుతి షిఫ్ట్ డిజైర్ కారు, రెండు సెల్ ఫోన్లు, ఒక చేతి గడియారం, దొంగతనాలకు ఉపయోగించిన స్క్రూ డ్రైవర్, ఇనుప రాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులున్నాయి. సోమవారం వారిని చేర్యాల కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసుల తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.