10 August, 2026 | 7:20 PM

Breaking News

అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం   •   పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం   •   సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన పద్మా రెడ్డి   •   మానవతా దృక్పథంతో గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి   •   ఘనంగా లక్ష బిల్వార్చన పూజ   •   శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి..!   •   శారాజిపేటలో డప్పుల కళాకారులకు డ్రెస్సుల పంపిణీ   •   ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య మంగీలాల్ నాయక్ నియామకం   •   బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి   •  

మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ వద్ద పర్యాటకుల భద్రతకు చర్యలు

10-08-2026 06:06 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, బ్యాక్ వాటర్ పరిసరాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులు అక్కడికి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాదంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు.ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, పోలీసు సిబ్బంది ఉన్నారు