బ్లాక్‌లిస్ట్‌లో మరో నాలుగు మిల్లులు
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మే 19(విజయ క్రాంతి) :ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ (CMR) లో అలసత్వం వహించినందుకు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మరో నాలుగు రైస్ మిల్లులను బ్లాక్లిస్ట్లో చేర్చారు. ప్రభుత్వానికి కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో దిగుమతి చేసుకోని మిల్లులపై ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూమార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని రైస్ మిల్లర్లు పీపీసీల నుండి ధాన్యాన్ని దిగుమతి చేసుకొని కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్లో తప్పనిసరిగా పాల్గొనాలని పలు మార్లు ఆదేశాలు జారీ చేయబడ్డాయని మిల్లింగ్ ఆపరేషన్లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు వెల్లడించిన మిల్లర్లు ఆ మాటలు పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీని దృష్టిలో పెట్టుకుని కుల్చారం మండలం మెదక్ జిల్లా. లక్ష్మీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ కోనాపూర్,వేణుగోపాల స్వామి బిన్నీ మోడరన్ రైస్ మిల్ శివపల్లి, ఎంఎస్ శ్రీ శ్రీనివాస మోడరన్ బిన్నీ రైస్ మిల్, గోమరమ్ గోమారం, శ్రీ మాతా ట్రేడింగ్ కో, దొంతి. శివార్వారు పీపీసీల నుండి కేటాయించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం గమనించబడినది.
దీనివల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి మరియు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో, సంబంధిత జి.ఓ నిబంధనల ప్రకారం పై రైస్ మిల్లులను పాడి ప్రొక్యూర్మెంట్ మరియు కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్ నుండి తక్షణ ప్రభావంతో బ్లాక్ / బ్లాక్లిస్ట్ చేయడం జరిగినది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా రైస్ మిల్లులకు ఎటువంటి ధాన్యం కేటాయింపు చేయబడవని వెల్లడించారు.






