కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి
12 మందినీ అదుపులోకి తీసుకున్న పోలీ సులు
వాహనాలు, నగదు, కోడిపందేల కత్తులు స్వాధీనం
కామారెడ్డి,(విజయక్రాంతి): కోడి పందాలు నిర్వహిస్తున్నారు అనే పక్క సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్మాన్‌పల్లి గ్రామ శివారులో గల ఇటుక బట్టీ ప్రాంగణంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు కామారెడ్డి సిసిఎస్ పోలీసుల సహకారంతో సదాశివనగర్ పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో కోడిపందేలు ఆడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 09 ద్విచక్ర వాహనాలు, 03 కార్లు, 11 మొబైల్ ఫోన్లు, రూ.45,050 నగదు, 65 కోడిపందేల కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చట్టవిరుద్ధంగా కోడిపందేలు, జూదం వంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.






