10 August, 2026 | 6:26 PM

జెండాలతో జోరుగా తిరంగా యాత్ర

10-08-2026 05:10 PM

బెజ్జంకి: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో సోమవారం తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. యువకులు మోటార్‌సైకిళ్లపై, రైతులు ట్రాక్టర్లపై జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై  వందే మాతరం నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, రైతులు పాల్గొన్నారు.