20 May, 2026 | 4:07 AM

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌పై అవగాహన

20-05-2026 12:50 AM

ప్రమాణ స్వీకారం చేసిన ఆటో కార్మిక సంక్షేమ సంఘం కార్యవర్గం

కరీంనగర్, మే 19 (విజయక్రాంతి): కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్ర మం మంగళవారం రంగినేని గార్డెన్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, పీపీ, నగరపాలక సంస్థ మేయర్ కొల గాని శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ కార్పొరేటర్లు, సంఘం లీగల్ అడ్వైజర్ లుక్కా రాజేశం, సీనియర్ నాయకులు చెలమల్ల రామచంద్రం పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి, అనంతరం ఆటో డ్రైవర్ల నూతన కార్యవర్గాన్ని సన్మానించారు.

కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బండారు సం పత్ పటేల్, కోశాధికారిగా చిట్టి మల్ల నాగభూషణం, ఉపాధ్యక్షులుగా కొత్తూరి సత్యనారా యణ, ఇరవేని కుమార్, కొత్తూరు రఘు, దండు అంజయ్య, కుకట్ల సంపత్, సహాయ కార్యదర్శులుగా వడ్లకొండ శ్రీనివాస్, వాల్క రమేష్, మీర్జా అఫ్జల్ బేగ్, ఇరుకుల్ల మహేష్, మారం సంపత్, ప్రచార కార్యదర్శులుగా మహమ్మద్ యాకూబ్, మౌటం శ్రీనివాస్, బీర్ల రాజు, ఈసీ మెంబర్లుగా కురుమాచలం వేణుమాధవ్, వీర్ల పరమేష్, కాల్వ మధు బాబు, నగునూరి ఎల్లయ్య ప్రమాణస్వీకారం చేశారు.

అనంతరం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఈ నెల రోజుల్లోనే కరీంనగర్‌లో ఆరుగురు చనిపోయారని, ప్రభుత్వం స్పందించి అలాంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కరీంనగర్‌లో ఫైనాన్స్ వల్ల ఆగడాలు ఎక్కువవుతున్నాయని వారి ఆగడాలను అరికట్టే దిశగా సంఘం పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ ఆటో డ్రైవర్లకు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.