ఈ విజయం దేశానికి అంకితం: ఈషా సింగ్
- ప్రపంచ రికార్డ్ విజయంపై హర్షం
- ఆసియా గేమ్స్, కామన్‌వెల్త్‌లో స్వర్ణాలే లక్ష్యమన్న యువ షూటర్
హైదరాబాద్, జూన్ 4 : భారత షూటింగ్‌లో వరుస విజయాలతో సంచలనాలు సృ ష్టిస్తున్న యువ షూటర్ ఈషా సింగ్ ఇటీవల వరల్డ్ కప్‌లోనూ అదరగొట్టింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డుతో స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించిన ఈషా హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. ఈ సందర్భంగా మీడి యాతో ముచ్చటించిన ఆమె భవిష్యత్తు ల క్ష్యాలపైనా, ఇటీవల విజయాలపైనా మాట్లాడింది. వరల్డ్‌కప్‌లో ప్రపంచ రికార్డుతో స్వ ర్ణం గెలవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పింది.
దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడూ గౌరవమేనన్న ఈషా సింగ్ వరల్డ్‌కప్‌లో తన శ్రమకు ఫలితం దక్కిందని పే ర్కొంది. రెండు పతకాలతో సరికొత్త రికార్డు నెలకొల్పడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఈ విజయం దేశానికే అంకితమని పేర్కొం ది. తనకు మద్ధతుగా నిలిచిన తల్లిదండ్రులు, కోచ్‌లు, భారత షూటింగ్ సమాఖ్య, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని అంత ర్జాతీయ విజయాలు సాధించడమే లక్ష్యమని తెలిపింది.
ఆసియా గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించాలనుకునే చిన్నారులకు తల్లిదండ్రులు మద్ధతుగా నిలవాలని సూచించింది. చదువుతో పాటు వా రికిష్టమైన క్రీడల్లో ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. 21 ఏళ్లకే షూ టింగ్‌లో అత్యుత్తమ షూటర్లను ఓడించిన ఈషా సింగ్ పలు అద్భుత విజయాలను సొంతం చేసుకుంది.






