అడ్డదిడ్డంగా మట్టి తరలింపు
05-06-2026 01:30 AM
అడ్డుకున్న గ్రామస్తులు
కేసముద్రం, జూన్ 4 (విజయక్రాంతి): కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామ చెరువులో మట్టి తరలింపు అడ్డదిడ్డంగా నిర్వహిస్తున్నారని గ్రామస్తులు అడ్డు కున్నారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం మట్టి తరలింపుకు అనుమతి తీసుకున్న వారు, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా భారీ స్థాయిలో లోతు లో మట్టిని పెద్దపెద్ద యంత్రాలతో తొవ్వి తరలిస్తున్నారని, దీనితో చెరువు ఆకృతి పూర్తిగా దెబ్బతిని, భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిబంధనల మేరకు మాత్రమే మట్టి తరలించాలని ఆందోళనకు దిగడంతో మట్టి తరలింపు కార్యక్రమాన్ని నిలిపివేశారు.






