ప్రయాణం సాగేదెలా?
- అర ఫీటు గుంతలతో రోడ్లు
- అయిజ పట్టణంలో నరకంలా రోడ్లు
- కొత్త రోడ్లు వేయాలని స్థానికుల డిమాండ్
అయిజ, జూన్ 3: అయిజ మునిసిపాలిటిలో అత్యధిక జనాభా కలిగిన పట్టణంలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయ్యాయని, ఇరుకు రోడ్లు ప్రమాదకరమైన ప్రయాణాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని చోట్ల సుమారు 20 సంవత్సరాల క్రితం నాసిరకంగా వేసిన రోడ్లు దెబ్బతిని ప్రయాణనికి ఇబ్బందిగా ఉన్నాయని ప్రజలనుకుంటున్నారు. అయిజ పట్టణంలోని ఎస్సీ కాలనీ కి వెళ్లే దారి డాక్టర్ సుబ్బయ్య ఇంటి పక్కన గల ప్రధాన రహదారి మూలమలుపులో రోడ్డు పగిలి సగం రోడ్డును ఆక్రమిoచినది.
పది సంవత్సరాలుగా సుమారు రెండు ఫీట్ల గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందికరంగా మారి రోడ్డు అక్కడక్కడ అర ఫీటు గుంతల ద్వారా ప్రమాదగంటికలు సూచిస్తున్నాయి. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు వచ్చిన వెళ్లలేని పరిస్థితి. అక్కడి నుండి దాదాపు చర్చిని దాటుకొని దళితవాడ చివరి వరకు ఇదే పరిస్థితి. మరియు రోడ్డు మధ్యలో భగీరథ పైప్ లైన్ తీసుకొని వెళ్లడం వల్ల కాంట్రాక్టర్లు మధ్యలో ఆ ప్రదేశంలో మాత్రమే గీతగీసినట్టుగా రోడ్డు వేసి వదిలిపెట్టడం జరిగింది.
అటు ఇటు పోయే ద్విచక్ర వాహన దారులు, ఆటోలు ఆ రోడ్డు మధ్యలో ఎదురెదురుగా వెళుతూ ఎన్నోసార్లు ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు చెప్పుకుంటున్నారు. అంతేగాక అక్కడ రోడ్డు ఇరుకు పరిస్థితి మరియు దానికి అనుకొని ప్రక్కనే మూడు ఫీట్ల లోతు గల మురికి కాలువ( డ్రైనేజి) ఓపెన్ గా ఉన్నందువల్ల దుర్వాసన వస్తూ,పరిసర ప్రాంతాలవారికి మరియు ప్రయాణానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారులు ఏమాత్రం ఆదమరచిన అదుపు తప్పి ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లే.
వచ్చే జూన్ నెల రెండో వారంలో పాఠశాలలు పున:ప్రారంభించడం జరుగుతాయి. అప్పుడు ప్రైవేట్ పాఠశాలల బస్సులు, ఆటోలు, కార్లు ద్విచక్ర వాహనదారులు, తమ తమ పనులకు వెళ్లే కార్మికులు ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనాల రాకపోకల వల్ల వాహనదారులు, పాదాచారులు స్కూల్ బస్సుల మధ్య ప్రయాణం నిలిచిపోయి సుమారు అరగంట నుండి గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అవడం జరుగుతుందని ఆ ప్రదేశంలో పిల్లలు,ముసలి వాళ్లు ప్రయాణం చేయాలంటే సాహసంతో కూడుకున్న పని అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ఈ దారి మీదుగా తెల్లవారు జామున మొదలుకొని రాత్రి వరకు ప్రతినిత్యం జనసoచారం తిరిగే రద్దీ ప్రాంతం. అధికారులు, అనధికారులు,పాలకులు, కార్మికులు అధిక సంఖ్యలో ప్రయానిస్తుంటారు.ఇట్టి విషయo అధికారులు ,పాలకులు చూసి చూడనట్టుగా వ్యవహారిస్తున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు . దళితవాడ సుమారు 80% ప్రజలు ఈ దారి మీదుగానే వెళుతున్నారు.
మరియు ఇది దళిత వాడకు వెళ్లే దారి అయినందువల్లనే గత పాలకులు, అధికారులు మరియు ప్రస్తుత పాలకులు, వివక్షత చూపుతున్నారా ? అనే విమర్శలు కూడా ప్రజల్లో వెళ్లువెత్తుతున్నాయి. కావున ప్రస్తుత పాలకులైన ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు పున: ప్రారంభించక ముందే అట్టి రోడ్డును వేయించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయిజ పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ సుబ్బయ్య ఇంటి దగ్గర నుండి వెంకన్న కట్ట మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్డు ఇరుకుగా(కొందరు రోడ్డుపై నిర్మాణాలు చేపట్టడం వల్ల )ప్రయాణనికి ఇబ్బంది కరంగా ఉన్నది. అట్టి రోడ్డును వెడల్పు చేస్తే బాగుంటుందని దీనిపై అధికారులు, పాలకులు దృష్టి సారించాలని పుర ప్రముఖులు పెద్దల్లో చర్చ సాగుతుంది.
రోడ్డుకు టెండర్ పిలిచాం....
అట్టి రోడ్డుకు టెండర్ పిలిచామని సాధ్యమైనంతవరకు త్వరలో రోడ్లు వేయిస్తాం
- మునిసిపల్ చైర్మన్ సురేష్
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
దళితవాడలోని పాత గేరిలో చాలాచోట్ల ఎప్పుడో సుమారు 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు కావడం వల్ల అవి దాదాపుగా 80% రోడ్లు భీటలు భారీ వాహనాల రాకపోకల వల్ల, పెద్ద పెద్ద మోకాటి లోతు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. మరియు గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే మునిసిపల్ అధికారాలు చేపట్టిన దళితవాడ అభివృద్ధిలో శూన్యమని, దళితులు అయినందుకే అన్ని వర్గాల వారు వివక్షత చూపుతున్నారా ? . కావున ప్రస్తుత పాలకులు గానీ అధికారులు గానీ ప్రజలను దృష్టిలో ఉంచుకొని అట్టి రోడ్డు పనిని పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
- రాజారత్నం, బిఎస్‌పి పార్టీ మండల నాయకులు






