5 June, 2026 | 2:06 AM

సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి

05-06-2026 12:43 AM
  1. పనుల్లో వేగం పెంచండి
  2. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
  3. నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పర్యటన
  4. కొడంగల్ ఎత్తిపోతలు, గుడ్డెం దొడ్డి పంపుహౌస్ పరిశీలన
  5. ప్రాజెక్టులపై ఫొటో ఎగ్జిబిషన్, పీపీటీ ప్రజెంటేషన్
  6. హాజరైన కర్ణాటక మంత్రి బోసు రాజు 

నారాయణపేట/గద్వాల, జూన్ 4 (విజయక్రాంతి): సాగునీటి ప్రాజెక్టుల పనులు సకాలం లో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గురువారం నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఆయన పర్యటిం చారు. మంత్రులతో కలిసి బీమా కృష్ణా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి.. కర్ణాటక మంత్రి బోసు రాజుతో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి పీపీటీ ద్వారా సమీక్ష జరిపారు.

జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా చేపట్టిన ధరూర్ మండలంలోని జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడ్డెం దొడ్డి జలాశయంను సందర్శించారు. సామర్థ్యాన్ని 11 లేదా 15 టీఎంసీలకు పెంచాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారుల ప్రతిపాదనల నేపథ్యంలో పంపు హౌస్‌ను సందర్శించారు. ఇరిగేషన్ అధికారులు జిల్లాకు అవసరమైన నీటి వనరుల సామర్థ్యం పెంపు ప్రతిపాదనలను వివరించారు.

ముఖ్యంగా గూడెం దొడ్డి ప్రాజెక్టు 15 టీఎంసీలకు పెంచడం, ర్యాలంపాడు సీపేజీ సమస్యను పరిష్కరించి నాలుగు టీఎంసీల నీటి స్టోరేజ్ నిలువ చేసే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంద ని అలాగే మల్లమ్మ కుంట భూసేకరణ పనులను చేపట్టాల్సిందని తెలియజేశారు. అంతకు ముందు జిల్లా ప్రాజెక్టుల గురించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 

కొడంగల్ ఎత్తిపోతలతో లక్ష ఎకరాలకు సాగునీరు

మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపలి గ్రామ సమీపంలో కొనసాగుతున్న మక్తల్- నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల ప్యాకేజ్ -1 పనులను పరిశీలించారు. పంప్ హౌస్ పనులు  ఎంత శాతం పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీటు పనులను ప్రారంభించి పంప్ హౌస్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫోటోగ్యాలరీని సీఎం వీక్షించారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భీమా కృష్ణానదులపై ప్రతిపాద బ్యారే జీ పనులు పురోగతికి సంబం ధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్లాన్ మ్యాప్స్ ద్వారా ముఖ్యమంత్రికి ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా వివరిం చారు. ప్యాకేజీల ప్రకారం పనుల భాగంగా ఎప్పుడు ఏ పని ప్రారంభమవుతుంది ఎన్ని రోజుల సమయం పడుతుం దని, ముందు జరగనున్న పనుల పురోగతికి సం బంధించి పలు అంశాలను సీఎం దృష్టికి ఇరిగేషన్ అధికారులు తీసుకువచ్చారు. 

కార్యక్ర మంలో గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ సత్యనా రాయణరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీధర్, కలెక్టర్‌లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ప్రియాంక, గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు, రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సీఈ రహీముద్దీన్ పాల్గొన్నారు.