18 April, 2026 | 3:44 AM

ఇది ప్రజాస్వామ్యానికి విజయం

18-04-2026 12:48 AM

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నాలు విఫలం 

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): దేశ సమాఖ్య స్ఫూర్తిని ప్రభావితం చేసేలా హడావిడిగా తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదన చివరికి వెనక్కి తగ్గడం ప్రజాస్వామ్య విజయమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి అంశాలను ముందుకు తెచ్చి ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాలు సృష్టించే ప్రయత్నం చేసిన అధికార కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సమర్థవంతంగా సమాధానం ఇచ్చిందని ఎంపీ తెలిపారు. ప్రాంతీయ సమతౌల్యాన్ని దెబ్బతీసే విధంగా తీసుకువచ్చిన ప్రతిపాదనలపై ప్రతిపక్షం ఏకతాటిపై నిలబడి ప్రజాస్వామ్య విలువలను కాపాడిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.