18 April, 2026 | 2:22 AM

అడుగంటుతున్న భూగర్భజలాలు

18-04-2026 12:47 AM

ఎల్‌ఎండిలో తగ్గుతున్న నీటిమట్టం

కరీంనగర్ , ఏప్రిల్ 17(విజయక్రాంతి): వేసవిలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలితున్నాయి. జిల్లా పరిధిలోని చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు అదిగంటుతున్నాయి. ఉక్కపోత, భరించలేని వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కూడా నీటిని అదే స్థాయిలో వినియోగిస్తున్నారు.

ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నా రు. తమ స్థిరాస్తులు, ఆభరణాలు తనాఖా పెడుతూ, అట్టడుగుకు చేరిన నీటిని పైకి తె చ్చేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిమట్టంపై జిల్లా భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చిలో 8.10 మీటర్లు, ఏప్రిల్ లో 9.02 మీటర్ల సగటు నీటిమట్టం నమోదైంది.

గత ఏడాది వేసవిలో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టంలో మార్పు వచ్చి, కొంతమేర ఉపశమనం కలిగింది. అనంతరం అసలు రెయినీ సీజన్లోనే వర్షా లు ముఖం చాటేయగా, ఎప్పటికప్పుడు భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నా యి. అడపాదడపా వర్షాలు కురిసినా వాటి తో భూగర్భజలాలు పెరగలేదని భూగర్భ జల వనరుల శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

గంగాధర లో రైతన్న అష్ట కష్టాలు...

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో వేసవి తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరి పంట కు సరిపడా నీరు అందకపోవడంతో పం టలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ బావుల్లో పేరుకుపోయిన మట్టిని క్రేన్ల సహాయంతో తొలగిస్తున్నారు. నీటి నిల్వలు పెరగాలని ఆశిస్తూ పెద్ద మొ త్తంలో ఖర్చు పెట్టి బావులను శుభ్రం చేస్తున్నారు. అంతేకాకుండా, మరింత నీరు అం దుబాటులోకి రావాలనే ఉద్దేశంతో బావుల పక్కనే సైడ్ బోర్లు కూడా వేయిస్తున్నారు.

ఎల్‌ఎండిలో తగీన నీటిమట్టం

కరీంనగర్ ఎల్‌ఎండీ సామర్థ్యం 24.034 టి ఎంబసీ లు కాగా జలాశయంలో నీటి నిల్వలు 6.9 టీఎంసీలకు పడిపోవడంతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ప్రతిరోజూ 55 ఎంఎల్డీల నీటిని సరఫరా చేసిన నగరపాలక సంస్థ, రెండు రోజులకు ఒకసారి సరఫరా చేసేందుకు సిద్దం అవుతుంది ఎంఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.  మిడ్ మానేరు నుంచి ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.